Arrow icon
October 13, 2021
కో– ఆరిజినేషన్‌ భాగస్వామ్యం ప్రకటించిన యు గ్రో క్యాపిటల్‌ మరియు కినారా క్యాపిటల్‌

  • యు గ్రో క్యాపిటల్‌ యొక్క గ్రో ఎక్స్‌ట్రీమ్‌ ప్లాట్‌ఫామ్‌తో తమ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానించిన కినారా క్యాపిటల్‌
  • ఎంఎస్‌ఎంఈలకు 100 కోట్ల రూపాయల తనఖా లేని ఋణాలను అందించడానికి కట్టుబడిన యు గ్రో

  హైదరాబాద్‌, అక్టోబర్‌ 13, 2021 లిస్టెడ్‌, చిరు వ్యాపారాలకు ఋణాలు అందించే ఎంఎస్‌ఎంఈ కేంద్రీకృత ఫిన్‌టెక్‌ వేదిక యు గ్రో క్యాపిటల్‌ మరియు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్‌ , కినారా క్యాపిటల్‌లు నేడు ఓ వ్యూహాత్మక కో–ఆరిజినేషన్‌ భాగస్వామ్యాన్ని తనఖా రహిత వ్యాపార ఋణాలను భారతదేశంలోని చిరు వ్యాపార సంస్థలకు అందించేందుకు చేసుకున్నట్లు వెల్లడించాయి. ఈ రెండు కంపెనీలూ కలిసి 2022 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయలను తయారీ, వాణిజ్య మరియు సేవా రంగాలలోని ఎంఎస్‌ఎంఈలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

  ఈ కో –ఆరిజినేషన్‌ ఒప్పందం ప్రధానంగా, యు–గ్రో యొక్క ఎనలిటికల్‌ డాటా ఆధారిత నిర్ణయం మరియు ఏపీఐ ల ద్వారా కినారా క్యాపిటల్‌ యొక్క స్మార్ట్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయడంపై ఆధారపడుతుంది. సంవత్సరాల తరబడి ఏఐ/ఎంఎల్‌ ఆధారిత నిర్ణయాలు మరియు అండర్‌ రైటింగ్‌ అనుభవంతో కినారా క్యాపిటల్‌ ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ వ్యవస్ధాపకులకు 24 గంటలలో ఋణ దరఖాస్తు స్వీకరించడం మొదలు డిస్బర్శ్‌మెంట్‌ చేయడం వరకూ చేస్తుంది. టియర్‌ 1 –3 నగరాల్లోని 300కు పైగా పిన్‌కోడ్‌లలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఈ భాగస్వామ్యం ద్వారా ప్రయోజనం పొందుతారు. కినారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుశ్చేరిలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

  యు గ్రోక్యాపిటల్‌ యొక్క గ్రో ఎక్స్‌–స్ట్రీమ్‌ వేదిక తో ఈ భాగస్వామ్యం సాధ్యమైంది. ఫిన్‌టెక్‌లు, చెల్లింపు వేదికలు, ఎన్‌బీఎఫ్‌సీలు, నియో బ్యాంక్‌లు, మార్కెట్‌ ప్రాంగణాలు మరియు ఇతర డిజిటల్‌ వేదికల కోసం ఏపీఐ ఆధారిత మరియు అత్యున్నతంగా తీర్చిదిద్దబడిన సాంకేతికత వేదిక గ్రోఎక్స్‌– స్ట్రీమ్‌. ఈ వేదిక ద్వారా యు గ్రో, ఎంఎస్‌ఎంఈ ఋణాలతో కో ఆర్డినేట్‌ చేయడంతో పాటుగా భారీ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలతో కో–లెండింగ్‌ చేయడమూ చేస్తుంది. ఈ కంపెనీ 15కు పైగా కో –ఆరిజినేషన్‌ భాగస్వామ్యాలను బహుళ భాగస్వాములతో చేసుకుంది.

  యు గ్రో క్యాపిటల్‌ మరియు కినారా క్యాపిటల్‌ సంయుక్తంగా ఇప్పుడు వందలాది చిరు వ్యాపార సంస్థలకు వారి వ్యాపారాభివృద్ధి కోసం అవసరమైన ఋణాలను అందించనున్నాయి.

  శ్రీ సచీంద్ర నాథ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, యు గ్రో క్యాపిటల్‌ మాట్లాడుతూ ‘‘ కినారా క్యాపిటల్‌తో భాగస్వా మ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. తద్వారా ఎంఎస్‌ఎంఈ క్రెడిట్‌ అంతరాలను పూరించాలనే మా లక్ష్యం చేరుకోనున్నాం. ఫిన్‌టెక్‌తో కో–ఆరిజినేషన్‌ చేసుకోవడమనేది ఎంఎస్‌ఎంఈల ఆర్థిక సమ్మిళితను చేరుకోవడంలో అత్యంత కీలకమైనమార్గాలలో ఒకటి అని మేము నమ్ముతుంటాం. ఇదే మేము గ్రోఎక్స్‌– స్ట్రీమ్‌ సాంకేతిక వేదికను రూపొందించేందుకు మాకు సహాయపడింది. ఈ తరహా అవసరమైన భాగస్వామ్యాలు విజయం సాధించేందుకు సైతం ఇది తోడ్పడుతుంది. కినారా క్యాపిటల్‌తో దీర్ఘకాలిక బంధం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము మరియు మరిన్ని ఎంఎస్‌ఎంఈలు వృద్ధి చెందేందుకు తగిన మద్దతునందించే దిశగా కృషి చేస్తున్నాము’’ అని అన్నారు.

  హార్ధికా షా, ఫౌండర్‌ అండ్‌ సీఈవో, కినారా క్యాపిటల్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశపు చిరు వ్యాపార యజమానులకు మద్దతునందించాలనే మా లక్ష్యంను ప్రతిధ్వనింపజేస్తోన్న యు గ్రో క్యాపిటల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఓ భాగస్వామిగా, ఎంఎస్‌ఎంఈ రంగానికి ఋణాలను అతి సులభంగా అందించేందుకు చేతులు కలుపడమనేది దాని ఫైనాన్సింగ్‌, సాంకేతికత పరంగానూ దాని నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఇది స్థానిక మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థలపై తక్షణ ప్రభావం చూపనుంది మరియు ఈ సంవత్సరం వ్యాపారాలు పునర్నిర్మాణం జరుగుతుండటంతో పాటుగా వృద్ధిని కొనసాగిస్తున్నందున ఉద్యోగ సృష్టి చాలా అవసరం’’ అని అన్నారు.

  ఈ కో–ఆరిజినేషన్‌ భాగస్వామ్యం, వ్యాపార సంస్థలకు ప్రక్రియను సులభతరం చేయాలనే లక్ష్యం చేసుకుంది. ఎంఎస్‌ఎంఈలు ఒకే ఒక్కసారి నేరుగా కినారా క్యాపిటల్‌ వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఆ తరువాత ఆన్‌లైన్‌లో ఫోన్‌ లేదా కినారా ప్రతినిధి ద్వారా ప్రక్రియను ఆరంభించాల్సి ఉంటుంది. ఒకసారి అప్రూవ్‌ అయిన తరువాత, ఋణ మంజూరు డాక్యుమెంట్లలో యు గ్రో క్యాపిటల్‌ మరియు కినారా క్యాపిటల్‌ పేర్లు రెండూ ఉంటాయి. వినియోగదారులకు సేవలను కినారా క్యాపిటల్‌ అందించడంతో పాటుగా అదనపు మద్దతునూ వ్యాపారాభివృద్ధి సూచననలు అందిస్తూ ఉచిత డిజిటల్‌ వర్క్‌షాప్‌ సిరీస్‌ ద్వారా అందిస్తుంది.

  ఎంఎస్‌ఎంఈలకు ఒక లక్ష రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకూ ఋణాలను 12–60 నెలల కాల వ్యవధితో అందిస్తారు. ఈ ఋణాలను వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం పొందవచ్చు. అలాగే నేరుగా కినారా క్యాపిటల్‌ నుంచి ఆస్తి కొనుగోలు కోసమూ పొందవచ్చు. మహిళా ఆధారిత వ్యాపారాలు హర్‌ వికాస్‌ కార్యక్రమం ద్వారా పలు రాయితీలూ పొందవచ్చు.

  కినారాకు ఆరు రాష్ట్రాలలో 110 శాఖలు ఉన్నాయి. ఇప్పటి వరకూ 60వేలకు పైగా తనఖా లేని ఋణాలను చిరు వ్యాపారులకు అందించింది. యు గ్రో క్యాపిటల్‌కు 9 రాష్ట్రాలలో 34 శాఖలు ఉన్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరంలో వీటిని 100కు వృద్ధిచేయాలని లక్ష్యం పెట్టుకోవడంతో పాటుగా రాబోయే నాలుగు ఆర్ధిక సంవత్సరాలలో 2.5 లక్షల ఎంఎస్‌ఎంఈలకు చేరుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది.

  Written by
  • Tags
  • #colending
  • #financialinclusion
  • #India
  • #KinaraCapital
  • #MSMEs
  • #partners
  • #TeamKinara
  • #UGro

  You may also like

  January 3, 2022

  Easing Liquidity Crunch for Mid-Sized and…

  Read More

  In an exclusive article for ET BFSI, our Founder and CEO Hardika Shah talks about NBFC lending amidst the pandemic, regulations in the sector and various measures taken during the year.

  Read More
  December 11, 2021

  MPW: Why Women Remain a Minority…

  Read More

  In an interaction with Business Today, our Founder and CEO Hardika Shah talks about her experience as the founder of Kinara and gender equality in startup ecosystem

  Read More